


ఫిర్యాది సిరిగిరి శ్యామలమ్మ, వయస్సు 62 సంవత్సరములు, భర్త సిరిగిరి జనార్ధన్ గౌడ్, AP.హౌసింగ్ బోర్డు కాలనీ, బి క్యాంప్, కర్నూల్ పట్టణము, 10.03.2026 నా ఉదయము సుమారు 11.30 గంటల సమయములో తన ఇంటి ముందు అరుగుపైన తన మనువరాలిని అడిపించు చుండగా, ఒక గుర్తు తెలియని వ్యక్తి మోటార్ సైకల్ పైన తన వద్దకు స్పీడుగా వచ్చి తన మెడలోని బంగారు పుస్తల చైన్ ను దొంగలించుకొని అక్కడి నుండి మోటార్ సైకల్ పై పారిపోయినాడు.
ఫిర్యాదు సిరిగిరి శ్యామలమ్మ, వయస్సు 62 సంవత్సరములు, ఇచ్చిన ఫిర్యాదు మేరకు Cr.No-64/2026, U/Sec 304(2) BNS, కేసు S.I A.P శ్రీనివాసులు గారు నమోదు చేసినారు. ఈ కేసు దర్యాప్తు లో భాగంగా ఈ దినము ఉదయము ముద్దాయి గురించి ఇన్స్పెక్టర్ పి. శేషయ్య గారికి, సమాచారము రాగా, వారి ఉత్తర్వుల మేరకు S.I A.P శ్రీనివాసులు గారు తన సిబ్బందితో వెళ్ళి ముద్దాయి చాకలి ప్రవీణ్, వయస్సు 24 సంవత్సరములు, S/o సి. రాముడు, గోపాలదీన్నే గ్రామము, ఇటిక్యాల మండలము, జోగులంబ గద్వాల జిల్లా, తెలంగాణ, ప్రస్తుత నివాసము బాలాజి నగర్, కర్నూల్ పట్టణము మరియు అను వ్యక్తిని, నంద్యాల చెక్ పోస్ట్ సమీపములో టివి టవర్ వద్ద ఈ దినము మధ్యన్నాము 12.30 గంటలకు అరెస్టు చేసి, వారి వద్ద దొంగలించిన 30 గ్రాముల బంగారు పుస్తెల చైన్ ను మరియు ముద్దాయి చైన్ స్నాట్చింగ్ కు ఉపయోగించిన యెరుపు రంగు స్టార్ సిటి మోటార్ సైకల్ TS06 EP 0480 ను స్వాదినపరచుకోవడమైనది, ముద్దాయి ముద్దాయి మిత్రుడు అయిన గద్వాలకు చెందిన మధుసూదన్ రెడ్డి ఇద్దరు హోటల్ వ్యాపారములో నష్టపోయి అప్పులు చేసి ఆ అప్పులు తీర్చుటకొరకు క్రికెట్ బెట్టింగ్ కు అలవాటు పడి అందులో కూడా నష్టపోయి ఇంకా అప్పులు చేసి ఆ అప్పులు తీర్చుటకొరకు సులభంగా డబ్బులు సంపాయించుట కొరకు, చైన్ స్నాట్చింగ్ చేసినాడు, సదరు ముద్దాయిని రిమాండ్ కు పంపడ మైనది. ఈ కేసు దర్యాప్తులో S.I. లు A.P Srinivasulu, M.Chandra Sekhar Reddy, Bala Naarsimhulu, HC’s 1)Chenchanna, 2) Sunkanna, PC’s 1) Santhosh, 2) Thirimalesh మరియు CCS సిబ్బంది 3) Kamela Naik, 4), Sriniavsulu వీరు లను ప్రతిభ కనపరిచిన పై వారి అందరినీ జిల్లా S.P మరియు మరియు కర్నూల్ D.S.P గారు అభినందించడమైనది
( పి. శేషయ్య) ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, కర్నూల్ మూడవ పట్టణ పోలీసు స్టేషన్