యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలి####ఈగల్ చీఫ్ ఐజీ శ్రీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ ###గారు .

పత్రికా ప్రకటన ( 28.03.2026)

కర్నూలు జిల్లా…

యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలి…ఈగల్ చీఫ్ ఐజీ శ్రీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారు .

కర్నూలులో ఈగల్ టీం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం…

కర్నూలు కలెక్టరేట్ దగ్గర ఉన్న  ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ  కర్నూలు బ్లడ్ బ్యాంక్ లో శనివారం ఈగల్ టీం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని ఈగల్ చీఫ్ ఐజీ శ్రీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా కెవి సుబ్బారెడ్డి  కళాశాల కు చెందిన 28 మంది విద్యార్థులు  స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

అలాగే తలసేమియా రక్త మార్పిడి కేంద్రాన్ని ఐజీ గారు పరిశీలించారు.

ఈ సందర్భంగా 6 మంది తలసేమియా బాధితులైన పిల్లలకు  రక్త మార్పిడి నిర్వహించారు.

వేసవికాలంలో రక్తం కొరత  ఉంటుందని,  యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఈగల్ ఐజి గారు  పిలుపునిచ్చారు.

సమాజ సేవలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో  అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ హుస్సేన్ పీరా , ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ కర్నూల్ డిస్టిక్ బ్రాంచ్ చైర్మన్ డాక్టర్ కేజీ.గోవింద రెడ్డి గారు, వైస్ చైర్మన్ శ్రీమతి.కె.అరుణ గారు,ట్రెజరర్ ఐ.నరసింహ గారు, కర్నూలు టు టౌన్ సిఐ నాగరాజా రావు,  కమిటీ మెంబర్లు జి.శ్రీనివాస్ యాదవ్ గారు,ఎం జె బాబు రాజుగారు,కెవి.సుబ్బారెడ్డి గారు, మెడికల్ ఆఫీసర్లు బి.కుమారస్వామి రెడ్డి గారు, జి.రామచంద్ర రావు గారు, కె.వి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు

#APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
#APPolice
#appolice
Is this your new site? Log in to activate admin features and dismiss this message
Log In