
ప్రభుత్వ వైద్య విద్యార్థుల పరిశోధనలు, క్రీడలకు ప్రోత్సాహం!
ప్రభుత్వ వైద్య విద్యార్థుల పరిశోధనలు, క్రీడలకు ప్రోత్సాహం!
అల్లోపతితోపాటు ఆయుష్, డెంటల్, ఫిజియోథెరపీ, అలైడ్ సైన్సెస్ కోర్సులకు కూడా వర్తింపు
విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫ్యాకల్టీకి రీసెర్చ్ గ్రాంట్ పెంపు
వర్సిటీ కేంద్రంగా ఏఐ బేస్డ్ డిసీజ్ మోడలింగ్ అండ్ డెసిషన్ సెంటర్ ఏర్పాటు
ఈ-రీసోర్స్ ద్వారా 24 గంటలపాటు విద్యార్థులకు పరిశోధన సమాచారం
పూర్వ వైద్య విద్యార్థుల అసోసియేషన్లను ఒకే తాటిపై తెచ్చేందుకు కృషి
వైద్య విద్యలో ప్రమాణాల పెంపు కోసం అభివృద్ధికి మరికొన్ని వినూత్న కార్యక్రమాలు
వర్శిటీ ఉపకులపతి డాక్టర్ చంద్రశేఖర్ వెల్లడి
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పరిశోధనలు, క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నామని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పుల్లల చంద్రశేఖర్ వెల్లడించారు. వైద్య విద్యలో ప్రమాణాల పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీసుకుంటున్న చర్యలకు కొనసాగింపుగా విశ్వవిద్యాలయం తరపున క