


కర్నూలు…9/04/2026
*ఈశ్వర్ ప్లే స్కూల్ ప్రారంభించిన మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్*
స్థానిక షరీన్ నగర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన ఈశ్వర్ ప్లే స్కూల్ ను మాజీ రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ ఈరోజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక వసతులతో చిన్న పిల్లలకు అవసరమైన ఏర్పాట్లతో ఈశ్వర్ ప్లే స్కూలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్లే స్కూల్ నందు చేరే చిన్న పిల్లల రక్షణ కొరకు మేనేజ్మెంట్ అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని టీజీ వెంకటేష్ తెలిపారు. చిన్నపిల్లల్లో ఆటపాటలతో పాటు విద్య పట్ల ఆసక్తి కనబరిచే విధంగా అన్ని వసతులను ఏర్పాటు చేయడం వారి చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. లాబాపేక్ష లేకుండా చిన్నపిల్లలను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం ప్రారంభించిన ఈశ్వర్ ప్లే స్కూల్ అనతి కాలంలోనే వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నట్టు టీజీ తెలిపారు. నేటి బాలలే, రేపటి భావి భారత పౌరులని అటువంటి పౌరులను చిన్నప్పటినుంచే సన్మార్గంలో పయనించే విధంగా ప్లే స్కూల్ యాజమాన్యం కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఈశ్వర్ ప్లే స్కూల్ యాజమాన్యం ఈశ్వర్ బాబు, వెంకటేష్ తేజ, త్రినాథ్, లీలావతి ఆర్యవైశ్య నాయకుడు రాజగోపాల్, అడ్వకేట్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.