నాడు కాశ్మీరీ పండిట్ల విషయంలో జరిగిన అన్యాయమే పునరామృతం అవుతుందని ఏపీ బి ఎస్ ఎస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ##లయన్ వెంకట రామరాజు###కర్నూలు

రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య మాజీ అధ్యక్షుడు వెంకటరామరాజు
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ రిజర్వేషన్ ల అంశం పై గురించి బ్రాహ్మణులపై మరో మరో మారు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ .. మీడియా సమావేశాన్ని నిర్వహించడం పట్ల
ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెంకటరామరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కర్నూలులో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో మందకృష్ణ మాదిగ బ్రాహ్మణ జాతిపై చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. బ్రాహ్మణ జాతిపై విషం కక్కుతూ మందకృష్ణ మతి చెడి మాట్లాడుతున్నారని రామరాజు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ వ్యాఖ్యలను చూస్తుంటే మందకృష్ణ మాదిగను ఏదో రాజకీయ పార్టీ వెనక ఉండి నడిపిస్తున్నట్లు ఉన్నద న్నారు.
ఈ నేపథ్యంలో బ్రాహ్మణులంతా ఐక్యమై తిప్పి కొట్టని పక్షంలో ఒక నాడు కాశ్మీరీ పండిట్ల విషయంలో జరిగిన అన్యాయమే పునరామృతం అవుతుందని ఏపీ బి ఎస్ ఎస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లయన్ వెంకట రామరాజు వ్యాఖ్యానించారు.
మరోవైపు మందకృష్ణ మాదిగ రెచ్చిపోతూ.. మాలలు మాదిగలు బేదాభిప్రాయాలు ఉంటే వదిలేసి అంతా ఏకం కావాలని పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని తెలిపారు.
ఈ పరిస్థితులలో బ్రాహ్మణులు కూడా అంతా ఐక్యమై పోరాటం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో బ్రాహ్మణుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారయ్యే ప్రమాదం ఉందని రామరాజు అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులు అందరూ కలసికట్టుగా పోరాటాలు చేసి మన హక్కులను సాధించుకునేందుకు ముందుకు రావాలని రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య మాజీ అధ్యక్షుడు వెంకటరామరాజు పిలుపునిచ్చారు.