##MRPS జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ బ్రాహ్మణులకు బేషరతుగా  క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ###రాష్ట్ర మాజీ అధ్యక్షులు యన్. వెంకటరామరాజు###  రాష్ట్ర ##కార్యదర్శి  సుధీర్ ##

MRPS జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ బ్రాహ్మణులకు బేషరతుగా  క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర మాజీ అధ్యక్షులు యన్. వెంకటరామరాజు  రాష్ట్ర కార్యదర్శి  సుధీర్
  హెచ్చరించారు.
నంద్యాలలోని ప్రధమనందీశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ బ్రాహ్మణ కులాన్ని రెచ్చగొడుతూ.. అర్చకత్వంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయని  విమర్శించారు.
ఇటీవల జరిగిన రెండు సమావేశాలలో మందకృష్ణ మాదిగ బ్రాహ్మణులపై వ్యాఖ్యలు చేశారని ఆయన తెలిపారు.
మాల మాదిగలు అందరూ తమకు ఆప్తులేనని నేటికీ సమాజంలో అందరం కలిసికట్టుగా జీవిస్తున్నామని కాగా మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలు మాత్రం బ్రాహ్మణులను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆయన తెలిపారు.
ఈ విషయంపై బ్రాహ్మణులందరూ ఐక్యతగా నిలిచి న్యాయ పోరాటం చేస్తామని వారు  అన్నారు. మందకృష్ణ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించు కొని బ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నంద్యాల జిల్లా పరిధిలోని ఏడు నియోజకవర్గాల ప్రతినిధులతో పాటు.. ఆర్యవైశ్య,వాల్మీకి, బలిజ,నాయి బ్రహ్మణ,వడ్డెర   తదితర కుల సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొని ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో నందికొట్కూరు బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సురేశ్‌,బాలమురళీ కృష్ణ శర్మ,మరియు కమిటి సభ్యులు.
రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిళ్ళ పల్లి ప్రబాకర శర్మ,ప్రధ మనంది దేవస్దాన ప్రధాన అర్చకులు ప్రవీన్‌ శర్మ,శివ శర్మ,
ఈర్నపాడు నుండి అర్చకులు కరణం విజయ్‌ కుమార్‌,
డొన్‌ నండి బ్రాహ్మణ మహిళా అధ్యక్షురాలు శాంతి,
ఆళ్ళగడ్డ నుండి మీడియా సెల్‌ కన్వీనర్‌ అక్షింతల శ్రీనివాసులు,మరియు
మల్లాది ఆదినారాయణ,
ప్రశాంతి,శైలజ,రఘురామ శర్మ,నవీన్‌.. తదితరులు పాల్గొన్నారు
Is this your new site? Log in to activate admin features and dismiss this message
Log In