


కల్లూరు మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామం సమీపంలో శ్రీ సద్గురు దత్త కృపాలయం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ లలితా మాత అమ్మవారి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సద్గురుదత్త కృపాలయం వ్యవస్థాపకులు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గురూజీ దంపతులతో పాటు సంస్థ అధ్యక్షుడు మల్లారెడ్డి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణం అమ్మవారి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించిన వివరాలను సద్గురు దత్త కృపాలయం వ్యవస్థాపకులు చంద్రశేఖర్ రెడ్డి గురూజీ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కు వివరించారు. దేవాలయం ఇరుపక్కల శ్రీ సద్గురుదత్త కృపాలయం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న భవనాలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పరిశీలించారు ఇందులో నిర్మిస్తున్న సేవా భవనంతో పాటు వృద్ధాశ్రమానికి సంబంధించిన భవనాల వివరాలను గురించి తెలుసుకున్నారు .ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ శ్రీ లలితా అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. శ్రీ సద్గురు దత్త కృపాలయం చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు.