###మంత్రాలయం , చిలకలడోణ వద్ద  రోడ్డు ప్రమాదం 8 మంది మృతి, 12 మందికి గాయాలు. క్షతగాత్రులను పరామర్శించిన … కర్నూలు  ఎస్పీ  శ్రీ  విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు.#####

పత్రికా ప్రకటన(  16.04.2026 )

కర్నూలు జిల్లా …

మంత్రాలయం , చిలకలడోణ వద్ద  రోడ్డు ప్రమాదం

8 మంది మృతి, 12 మందికి గాయాలు.

క్షతగాత్రులను పరామర్శించిన … కర్నూలు  ఎస్పీ  శ్రీ  విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు.

కర్నూలు జిల్లా  ,  మంత్రాలయం మండలం, చిలకల డోణ వద్ద జరిగిన  రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఎమ్మిగనూరులో ప్రాథమిక చికిత్స అనంతరం క్షతగాత్రులను కర్నూలుకు పంపించారు.

ఈ సందర్భంగా గురువారం ఉదయం కర్నూలు  ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు కర్నూలు  ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు.

వారి ఆరోగ్య పరిస్థితి గురించి  వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

ప్రస్తుతం 12 మంది కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

తెల్లవారుజామున బొలెరో వాహన డ్రైవర్ నిద్రమత్తులో వాహనం నడపడంతో డివైడర్ దాటి అవతలి రోడ్డు పై కి వెళ్లి   అశోక లై ల్యాండ్  వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు.

మంత్రాలయం దర్శనార్ధం బొలెరో వాహనంలో  కర్ణాటకకు చెందిన  20 మంది భక్తులు ప్రయాణం చేస్తుండగా, ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందినట్లు తెలిపారు.

ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ గారు పేర్కొన్నారు.

ప్రజలు వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, రహదారి భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

డ్రైవర్లు  నిద్ర మత్తులో వాహనం నడపడకూడదన్నారు.   నిద్ర వస్తే ప్రక్కకు వాహనం ఆపి విశ్రాంతి తీసుకోవాలన్నారు.

కర్నూలు ఎస్పీ గారితో పాటు సిఐలు మధుసుధన్ రావు, శివశంకర్, శేషయ్య ఉన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు

#APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
#APPolice
#appolice