###డ్రాగన్ బోట్ లో రజత పతకం సాధించిన క్రీడాకారులను అభినందించిన ###మాజీ రాజ్యసభ సభ్యుడుటీజీ వెంకటేష్ ###

డ్రాగన్ బోట్ లో కర్నూలు క్రీడాకారులకు రజత పతకం

రజత పతకం సాధించిన క్రీడాకారులను అభినందించిన మాజీ రాజ్యసభ సభ్యుడు
టీజీ వెంకటేష్


విజయవాడలో ఇటీవల ముగిసిన రాష్ట్రస్థాయి శాప్ వాటర్ స్పోర్ట్స్ లీగ్ పోటీల్లో కర్నూలు జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. డ్రాగన్ బోట్ అండర్-15 విభాగంలో పాల్గొన్న జిల్లా జట్టు ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది.
ఈ విజయం సాధించిన క్రీడాకారులను రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ బుధవారం తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. క్రీడాకారులను శాలువాలతో సత్కరించి, వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడల్లోనూ రాణించాలి.క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని ఇస్తాయి. జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో నిలబెట్టిన ఈ విద్యార్థులు అందరికీ ఆదర్శం” అని కొనియాడారు.వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధికి తన వంతు నిరంతరం కృషి చేస్తానని అన్నారు. అనంతరం జిల్లా క్రీడాభివృద్ధి అధికారి భూపతిరావు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో సాధన చేసి విజేతలుగా నిలిచారని అన్నారు.శిక్షకుడు చంద్రశేఖర్ ప్రోత్సాహంతో గత సంవత్సర కాలంగా అనే పతకాలు వస్తున్నాయని తెలిపారు.
రాష్ట్ర ఆర్యవైశ్య నాయకుడు మహేష్ గుప్తా మాట్లాడుతూ క్రీడాకారుల సంక్షేమానికి టీజీవి సంస్థలు ముందుంటాయి అన్నారు. ప్రతిభగల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాజ్యసభ మాజీ సభ్యుడు వెంకటేష్ ఎల్లప్పుడు ముందు ఉంటారని అన్నారు.ఆంధ్రప్రదేశ్ డ్రాగన్ బోట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అవినాష్ గుప్తా మాట్లాడుతూ జిల్లా జట్టులో చాలామంది క్రీడాకారులు టీజీ వెంకటేష్ డ్రాగన్ బోట్ క్లబ్ నుంచి ప్రతిరోజు సాధన చేస్తూ ఉన్నారని వారే కర్నూలు జిల్లా జట్టు రెండో స్థానం సాధించడంలో కీలక పాత్ర పోషించారు అన్నారు.ఈ కార్యక్రమంలో న్యాయవాది దాశెట్టి శ్రీనివాసులు,సీనియర్ జర్నలిస్ట్ శ్రీకాంత్,వాటర్ స్పోర్ట్స్ కోచ్ చంద్రశేఖర్,క్రీడాకారులు తల్లిదండ్రులు పాల్గొన్నారు

###21/04/2026 reported by sk mahesh gupta ###