
23/04/2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా గురువారం సాయంత్రం ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు.
నూతన బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తొలిసారిగా అమ్మవారిని దర్శించుకోవడం విశేషం.
క్షేత్రానికి చేరుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు దుర్గమ్మ దేవస్థాన ఈఓ వికె శీనా నాయక్ ఘన స్వాగతం పలికారు.
శ్రీ పునేఠా అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేయగా,ఈవో శీనా నాయక్ శ్రీ అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని బహుకరించారు.
దర్శనానంతరం ఆయన ఆలయ పరిసరాలను పరిశీలించి, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి ఈవోను అడిగి తెలుసుకున్నారు.