###పారదర్శకంగా బదిలీల కౌన్సిలింగ్  ప్రక్రియ చేపట్టిన … కర్నూలు  ఎస్పీ శ్రీ  విక్రాంత్ పాటిల్  ఐపియస్ గారు.###

పత్రికా ప్రకటన (22.04.2026)

కర్నూలు జిల్లా…

పారదర్శకంగా బదిలీల కౌన్సిలింగ్  ప్రక్రియ చేపట్టిన … కర్నూలు  ఎస్పీ శ్రీ  విక్రాంత్ పాటిల్  ఐపియస్ గారు.

*  133 మంది పోలీసులకు బదిలీలు. 

సాధారణ బదిలీల్లో భాగంగా బుధవారం కర్నూలు జిల్లాలోని  పోలీసు స్టేషన్ లలో ఒకే చోట 5 ఏళ్ళు సర్వీసు పూర్తి చేసుకున్న  పోలీసు సిబ్బందికి  బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియను  పారదర్శకంగా  చేపట్టామని  కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు తెలిపారు.

  జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జరిగిన బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ కు మొత్తం 133 మంది  హజరయ్యారు.

ఇందులో 15 మంది ఎఎస్సైలు,  25 మంది హెడ్ కానిస్టేబుల్స్ , 93 మంది కానిస్టేబుల్స్  ఉన్నారు.

ఈ సందర్భంగా కర్నూలు  ఎస్పీ గారు  పోలీసు సిబ్బందితో మాట్లాడారు. పలు సూచనలు చేశారు.

ఒకే పోలీసుస్టేషన్ లో  5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పోలీసులకు నిబంధనల ప్రకారం  పారదర్శకంగా బదిలీల ప్రక్రియ  చేపట్టామన్నారు.

గతంలో పని చేసిన పోలీసుస్టేషన్ లు కాకుండా ,   తమ  స్వంత మండలం, నియోజకవర్గం  మినహాయించి  ,   ఇతర   పోలీసు స్టేషన్ లు  ఎంపిక చేసుకోవాలని తెలిపారు.

ఖాళీల  ఆధారంగా  ఉన్న  పోలీసు స్టేషన్ ల ను ఎంచుకోవాలని సూచించారు.

విధుల పట్ల అలసత్వం వహించకుండా సంతృప్తికర బదిలీలతో  మరిoత భాద్యతగా పని చేయాలన్నారు.

పోలీసు సిబ్బందికి  కోరుకున్న చోటుకే బదిలీలు జరగడంతో  బదిలీల పట్ల  పోలీసు సిబ్బంది అందరూ ఆనందం వ్యక్తం చేశారు.

పోలీసు సిబ్బందిని కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేయడంతో  జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు  నాగరాజు ,  జిల్లా ఎస్పీ గారి కి పోలీసు సిబ్బంది తరపున  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ హుస్సేన్ పీరా ,  డిపిఓ  ఎఓ విజయలక్ష్మీ  , డిపిఓ సిబ్బంది ఉన్నారు.          

    జిల్లా పోలీసు కార్యాలయం – కర్నూలు.

#APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
#APPolice
#appolice

            ###By sk mahesh gupta ###