###మూడవ రోజు సింగపూర్ పర్యటనలో భాగంగా సహచర మంత్రులతో కలిసి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన PSA (Port of Singapore Authority) సందర్శించిన### మంత్రి వర్యులు శ్రీ బీ సి జనార్దన్ రెడ్డి ###
మూడవ రోజు సింగపూర్ పర్యటనలో భాగంగా సహచర మంత్రులతో కలిసి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన PSA (Port of Singapore Authority)ను సందర్శించాను. పోర్టు కార్యకలాపాలలో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ అభివృద్ధి దిశగా సాగుతున్న విధానాలపై సమీక్ష నిర్వహించాము. టువాస్ (TUAS) పోర్ట్ పనితీరును నేరుగా పరిశీలించి, పూర్తిగా ఆటోమేటెడ్ వ్యవస్థలతో కంటైనర్ నిర్వహణ ఎలా జరుగుతుందో అవగాహన పొందాము. డ్రైవర్‌లేని ఎలక్ట్రిక్ వాహనాలు, రిమోట్ కంట్రోల్ క్రేన్లు, స్మార్ట్ లాజిస్టిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలను PSA ప్రతినిధులు వివరించారు. ఈ ఆధునిక సాంకేతికతలను అధ్యయనం చేయడం ద్వారా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ పోర్టుల అభివృద్ధికి, సమర్థవంతమైన నిర్వహణకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నాము. #SingaporeVisit #PSA #TuasPort #PortDevelopment #SmartPorts #Automation #BCJR #BCJanardhanReddy #AndhraPradesh