###సింగపూర్ స్టడీ టూర్ 6 వరోజు మంత్రి వర్యులు శ్రీ బీ సి జనార్దన్ రెడ్డి గారు ##

సింగపూర్ పర్యటనలో భాగంగా ఆరవ రోజు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నాను. క్లిష్ట పరిస్థితుల్లో ఒక టీంగా సమర్థవంతంగా స్పందించే టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ (Table Top Exercise) విధానంపై సమగ్ర అవగాహన పొందాము.
సైబర్ సెక్యూరిటీ, డేటా లీక్, భద్రతా లోపాలు మరియు అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు విలువైన వివరాలు అందించారు. లక్ష్యాల నిర్ధారణ, బాధ్యతల కేటాయింపు, సమస్య పరిష్కారం, సమయానుకూల నిర్ణయాలు, లోపాల గుర్తింపు వంటి అంశాలు ఈ శిక్షణలో కీలకంగా నిలిచాయి.
ఈ విధానాలను రాష్ట్రంలో అమలు చేసే దిశగా పరిశీలిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన మరియు సమర్థవంతమైన ప్రతిస్పందన అందించేందుకు మా ప్రయత్నాలు కొనసాగుతాయి.
#SingaporeVisit #CrisisManagement #EmergencyPreparedness #CyberSecurity #DataSecurity #BCJR #BCJanardhanReddy

        ###By SK Mahesh gupta ###