###మాజీ రాజ్య సభ సభ్యులు శ్రీ టీ జీ వెంకటేష్ గారి జన్మ దిన సందర్భం గామే 16 న వివాహం చేసుకో బోయే నూతన వధూవరులకు  బంగారం పుస్తెలు, పట్టు వస్త్రాలు పంపిణీ*####

కర్నూలు…

*కాబోయే వధూవరులకు  బంగారం పుస్తెలు, పట్టు వస్త్రాలు పంపిణీ*

మాజీ రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, మే 16 తేదీన వివాహం చేసుకుంటున్న జంటలకు ఈరోజు టీజీ వెంకటేష్ స్వగృహంలో పట్టు వస్త్రాలు, కాళీ మెట్టెలు, బంగారు తాళిబొట్టు పంపిణీ చేశారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం 60 జంటలు మే 16న వివాహంతో ఒక్కటి కానున్నారు. వీరందరికీ మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారి సతీమణి శ్రీమతి రాజ్యలక్ష్మి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారి సతీమణి శ్రీమతి శిల్పా భరత్  గార్లు ఈ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులకు పట్టు వస్త్రాలను, తాళిబొట్టు, కాళీ మెట్టలు పంపిణీ చేశారు.  ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా మే 16న ఒక్కటయ్యే వారికి తమ కుటుంబం నుంచి సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా వారు తెలిపారు.  వివాహం చేసుకుంటున్న ప్రతి  జంటకి  80 వేల రూపాయల నగదు, 20 వేల రూపాయల విలువైన తాళిబొట్టు, కాలిమెట్టలతో పాటు పట్టువస్త్రాలు కూడా అందజేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుందని టీజీ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టివివి ట్రస్ట్ మ్యారేజెస్ కోఆర్డినేటర్లు వాయుగండ్ల సుబ్బారావు, దాశెట్టి శ్రీనివాసులు, విటల్ శెట్టి, ఉమామహేశ్వరరావు, జవహర్ బాబులతో పాటు నూతన వధూవరుల తల్లిదండ్రులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.