###టీ జీ వీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తలసేమియా రక్త మార్పిడి సెంటర్ భూమి పూజ పైలాన్ ఆవిష్కరణ చేసిన మంత్రి వర్యులు శ్రీ టీ జీ భరత్ గుప్తా ###

టి.జి.వి భవన్ లో తలసేమియా కేంద్రము ఏర్పాటుకు కోటి రూపాయల విరాళం ప్రకటన,రూ 25 లక్షల చెక్ అందజేత

కర్నూలు అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తున్నాం

ప్రజా సేవలో మా కుటుంబం ముందుంటుంది

పరిశ్రమలు , వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ గుప్త

కర్నూలు,మే 16 :- కర్నూలు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నామని మంత్రి టి. జి. భరత్ గుప్తా తలసేమియా కేంద్రం టి.జి.వి భవన్ లో ఏర్పాటుకు నిర్మాణ భూమి పూజ సందర్భంగా పేర్కొన్నారు.

శనివారం ఉదయం కర్నూలు బ్లడ్ బ్యాంక్ ఆవరణలో దాదాపు ఒక కోటి 50 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించ తలపెట్టిన టి.జి. వెంకటేష్ భవన్ లో తల సేమియా (రక్త మార్పిడి చేయుటకు ) కేంద్రాని కి పరిశ్రమలు , వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ గుప్త మరియు కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు భూమి పూజ నిర్వహించారు , జ్యోతి ప్రజ్వలన గావించి శిలాఫలకాన్ని సంయుక్తంగా ఆవిష్కరించారు. రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ గోవింద రెడ్డి జి కృష్ణుడు సెక్రటరీ కే అరుణ వైస్ చైర్మన్ ఐ నరసింహ ట్రెజరర్ కమిటీ సభ్యులు శ్రీనివాస్ కే వీ సుబ్బారెడ్డి ప్రభాకర్ రెడ్డి బాబు రాజ్ రఘునాథ్ రెడ్డి భీమశంకర్ రెడ్డి కె సుబ్బారెడి మీనాక్షి రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్ సిటీ కేబుల్ ఎస్ కే మహేష్ పాల్గొన్నారు

ఈ సందర్భంగా మంత్రి టి. జి.భరత్ గుప్త మాట్లాడుతూ… కర్నూలు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నామని తెలిపారు. గెలుపు ఓటమిలకు సంబంధం లేకుండా రాజకీయాలకు సంబంధం లేకుండా కర్నూలు అభివృద్ధికి ఎల్లవేళలా మా కుటుంబం ముందుగా ఉంటుందని తెలిపారు. ఈరోజు మా తండ్రి మాజీ మంత్రి , మాజీ పార్లమెంటు సభ్యులు టి.జి.వెంకటేష్ గారి జన్మదిన సందర్భంగా ఒక మంచి పని చేయాలన్న ఉద్దేశంతో మా టి.జి. వి గ్రూప్ నుండి ఒక కోటి రూపాయల విరాళం ఈ టి జి వి భవన్ లో తల సేమియా కేంద్రానికి ప్రకటించడం మరియు అందులో భాగంగా ప్రస్తుతం 25 లక్షల రూపాయల చెక్కును కర్నూలు బ్లడ్ బ్యాంక్ కు చెందిన రెడ్ క్రాస్ సొసైటీకి అందించామని తెలిపారు. ఈ టి జి వి భవన నిర్మాణాన్ని మూడు నెలల లోగా పూర్తి చేయాలని నిర్వాహకులను మంత్రి కోరారు.మా కుటుంబం ప్రజాసేవలో భాగంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటుందని ముఖ్యంగా కళ్యాణ మండపాలు,మినరల్ వాటర్ ప్లాంట్లు , క్రీడా ప్రాంగణాలు మరియు ఇప్పుడు తల సేమియా కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.సొంత నిధులతో కర్నూలు సర్వజన ఆసుపత్రిలో పలు కార్యక్రమాలు చేస్తూ కార్పొరేట్ స్థాయి ఆస్పత్రిగా మారుస్తున్నామని , మా భాగస్వామ్యంతో మరియు మెడికల్ కాలేజీ పూర్వపు విద్యార్థులతో 70 సెంట్ల స్థలం లో దాదాపు 60 కోట్ల రూపాయలతో నాలెడ్జ్ సెంటర్ భవనము ఏర్పాటు మొదలగు కార్యక్రమాలు చేస్తూ ఉన్నామని తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ గోవింద్ రెడ్డి సేవ చేయాలన్న తపనతో నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేస్తున్నందుకు ఆయనను అభినందిస్తున్నానని మంత్రి తెలిపారు. కర్నూలు ప్రజలు ఎల్లప్పుడూ మా కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరారు.

###By sk mahesh gupta ###