###కర్నూలు మెడికల్ కాలేజీ లోని ఓల్డ్ C.L.G విభాగంలో నిర్వహించిన పదవీ విరమణ అభినందన సభలో ప్రసూతి మరియు స్త్రీ రోగ విభాగం హెచ్‌.ఓ.డీ డా. సావిత్రి సోమశేఖర్ గారి కీ అభినందనలు ###

కర్నూలు మెడికల్ కాలేజీ లోని ఓల్డ్ C.L.G విభాగంలో నిర్వహించిన పదవీ విరమణ అభినందన సభలో ప్రసూతి మరియు స్త్రీ రోగ విభాగం హెచ్‌.ఓ.డీ డా. సావిత్రి సోమశేఖర్ గారిని ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ Dr K వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ :-

డా. సావిత్రి సోమశేఖర్ గారికి అభినందనలు తెలిపారు. వైద్య రంగంలో ఆమె అందించిన విశిష్ట సేవలను కొనియాడుతూ, కర్నూలు మెడికల్ కాలేజీకి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.

• డా. సావిత్రి సోమశేఖర్ గారు మహిళల ఆరోగ్య సంరక్షణలో విశేష సేవలు అందించి వేలాది మంది రోగుల జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు.

• అధ్యాపకురాలిగా, విభాగాధిపతిగా అనేక మంది అండర్ గ్రాడ్యుయేట్ మరియు పీజీ విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించి ఉత్తమ వైద్యులను తీర్చిదిద్దారని పేర్కొన్నారు.

• తన సౌమ్య స్వభావం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలతో సహచరుల మన్ననలు పొందుతూ విభాగ అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు.

చివరగా డా. కె. వెంకటేశ్వర్లు గారు డా. సావిత్రి సోమశేఖర్ గారికి ఆరోగ్యకరమైన, ఆనందభరితమైన పదవీ విరమణ జీవితం కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమం అనంతరం ఆమెను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ గారితో పాటు కర్నూల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ Dr చిట్టినరసమ్మ గారు, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డా C.S.K ప్రకాశ్ గారు, రీజినల్ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ DR M. సత్యనారాయణ రెడ్డి, కుటుంబ సభ్యులు తదితర ప్రొఫెసర్లు  పాల్గొన్నారు

### By sk mahesh gupta ####