టీ జీ వెంకటేష్ మాజీ రాజ్య సభ సభ్యులు

నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సహస్ర చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలోని బండి మెట్ట ప్రాంతానికి చెందిన శ్రీమతి సులోచన కు ఏర్పాటుచేసిన మూడు లీటర్ల వెట్ గ్రైండర్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆశ్ర చారిటబుల్ సొసైటీ ఉపాధ్యక్షులు సి.వి.ఎస్.ఎల్ కృష్ణ కిషోర్, శ్రీమతి జి సుష్మ, ఆకాంక్ష, ప్రహ్లాదశెట్టి, సుబ్బారావు, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు . ఈ సందర్భంగా సహస్ర చారిటబుల్ సొసైటీ ఉపాధ్యక్షులు కృష్ణ కిషోర్ మాట్లాడుతూ తాము చేసిన ఈ సహాయం చిన్నదే అయినప్పటికీ ఒక మహిళకు జీవనోపాధి కల్పించేందుకు మార్గం సుగమం అయిందని చెప్పారు. చూడటానికి ఈ కార్యక్రమం చిన్నదే అయినప్పటికీ సహాయానికి గొప్ప విలువ ఉందని తెలియజేశారు. ఈ యంత్రం ఒక మహిళ సంపాదనకు ,ఆత్మ నిర్భరతకు, గౌరవానికి సాధనంగా ఉపయోగపడుతుందని తెలియజేశారు. నిజమైన దానం పరిమాణంలో కాకుండా జీవితంలో తీసుకువచ్చే మార్పులు ఉంటుందని తెలియజేశారు.

Leave a comment

Is this your new site? Log in to activate admin features and dismiss this message
Log In