అశోక మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఈ క్యూబ్ కార్నివాల్ 2026 ను ప్రారంభించిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్.

అశోక మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఈ క్యూబ్ కార్నివాల్ 2026 ను ప్రారంభించిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్.
……..,…………………….
నగర శివారులోని అశోక మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఆరు రోజులపాటు జరగనున్న ఈ క్యూబ్ కార్నివాల్ 2026 ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్యఅతిథిగా హాజరై బెలూన్ లను గాలిలోకి ఎగురు వేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అశోక మహిళా ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ అశోక్ వర్ధన్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ నవీన్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అధికారిని సౌమ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు ఒక భాగం కావాలని అన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల క్రమశిక్షణ అంకిత భావం పెరిగి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని చెప్పారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక ,మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ రాణిస్తారని చెప్పారు. క్రీడల్లో పాల్గొనేటప్పుడు గెలుపు ఓటములను పట్టించుకోకుండా క్రీడల్లో పాల్గొనడమే ప్రధాన అంశంగా భావించాలని ఆయన వెల్లడించారు. అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య దాదాపు కొట్టుకునే స్థాయిలో పరిస్థితులు టీవీలలో కనిపిస్తాయని ,కానీ సమావేశం నుండి బయటకు రాగానే అధికార ,ప్రతిపక్ష సభ్యులు ఒకరినొకరు స్నేహపూర్వకంగా పలకరించుకుంటారని వెల్లడించారు. అసెంబ్లీలో, పార్లమెంటులో అధికార ,ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదాలు కేవలం అంశాల వారీగా నే ఉంటాయని వెల్లడించారు .తాను 20 సంవత్సరాలు ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ,మరో 20 సంవత్సరాలు బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశానని ,ఈ క్రమంలో అనేక జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలను నిర్వహించామని వెల్లడించారు.  విద్యార్థులు రోటీన్ కోర్సులకు భిన్నంగా ఉద్యోగ అవకాశాలు లభించే కోర్సులను ఎంచుకొని చదవడం ద్వారా త్వరగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలని ఆయన సూచించారు. ప్రస్తుతం కృత్రిమ మేధస్సు వేగంగా అభివృద్ధి చెందిందని , దానిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాలని కోరారు. అశోక మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే విద్యార్థులు సమస్యలను గుర్తించి వాటికి వినూత్న పరిష్కారాలను కనుగొనడమే వ్యాపారానికి తొలిమెట్టని, కేవలం సాంకేతిక విజ్ఞానమే కాకుండా మార్కెట్ అవసరాలను అర్థం చేసుకోవడం, టీం వర్క్ అలవాటు చేసుకోవాలన్నారు. అనంతరం అశోక మహిళా ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ అశోక్ వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేశ్ ను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. పారిశ్రామికవేత్తగా, రాజకీయ నాయకుడిగా, సామాజిక సేవ తత్పరతతో ఆయన ముందుకు సాగుతున్నారని వెల్లడించారు. అంతర్గత నైపుణ్యాలను పెంపొందించడానికి వేదికగా నిలుస్తుందని వెల్లడించారు. అనంతరం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేశ్ ను అశోక మహిళా ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ అశోక్ వర్ధన్ రెడ్డి ప్రిన్సిపల్ డాక్టర్ నవీన్ తదితరులు ఘనంగా సన్మానించారు.

Leave a comment

Is this your new site? Log in to activate admin features and dismiss this message
Log In