మంత్రి వర్యులు టీ జీ భరత్ రైతుల కు అన్ని రకాలుగా ఆసరా!!!

కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ పాలకమండలి ఆధ్వర్యంలో ప్రభుత్వo ద్వారా రైతుల ఉపయోగాలు ఉచిత పశు వైద్య శిబిరం ను జొహరాపురం గ్రామం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ మండలి చైర్మన్ శ్రీమతి గోల్కొండ అజ్మత్ బి గారు వైస్ చైర్మన్ కె. శేషగిరి శెట్టి గారు సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ శ్రీమతి ఆర్ జయలక్ష్మి గారు మరియు పాలకమండలి డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆదేశాల మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో  ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని రైతులు వారి పశువులకు పరీక్షలు చేయించుకొని పోషకాహారము మందులు తీసుకోవాలని సూచించారు. రెండవ విడత ఉచిత వైద్య శిబిరము 31వ తేదీ ఏర్పడి చేస్తున్నామని అక్కడ కూడా ఆ ప్రాంత రైతులు అందరూ ఉపయోగించుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు గారు మరియు మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారు రైతు సంక్షేమ మార్థం మార్కెట్ అభివృద్ధి కొరకు అన్ని విధాల సహకరిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి , వైద్య సిబ్బంది మరియు డైరెక్టర్లు శ్రీమతి ఏ మారుతి శర్మ , శ్రీమతి జయశ్రీ యాదవ్ ,శ్రీమతి సువార్తమ్మ ఏసన్న, మాధవస్వామి, గాండ్ల శ్రీధర్, మహమ్మద్ అలీ , సూపర్వైజర్లు సిబ్బంది, రైతులు, 18 వ వార్డు టిడిపి నాయకులు కూడా పాల్గొన్నారు

Leave a comment

Is this your new site? Log in to activate admin features and dismiss this message
Log In